రాజకీయ సంక్షోభం లో ఆంధ్ర ప్రదేశ్
Dec 10th, 2009 | Category: వార్తలుతెలంగాణా కి వ్యతిరేకం గా రాయల సీమ, కోస్తా ప్రజా ప్రతినిధులు చేస్తున్న ఆందోళన తారాస్థాయి కి చేరింది. ప్రజల్లో వేర్పాటు పై వెల్లువెత్తుతున్న నిరశన జ్వాలతో ప్రజా పర్తినిధులు పార్టీల కి అతీతం గా రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికి 113 మంది ఎం.ఎల్.ఎ లు రాజీనామా చేశారు. జే.సి. దివాకర్ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి, శోభా నాగిరెడ్డి, పరిటాల సునీత, లగడపాటి, మైసూరా రెడ్డి వంటి ప్రముఖులు రాజీనామాలు చేశారు. కాంగ్రెస్, తే.దే.పా, పీ.ఆర్.పీ ల నుంచి అధిక సంఖ్య లో నాయకులు రాజీనామాలు సమర్పించారు. మరో వైపు కేంద్రం లో కూడా రాజీనామాల పర్వం కొనసాగుతుంది. రాష్ట్రం లో తెలంగాణేతర నాయకులు ఎంతో మంది పార్టీలలో తమ పదవులకు కూడా రాజీనామా సమర్పించారు. సంస్థాగతం గా కూడా ఎంతో మంది జెడ్.పీ పదవులకు, పంచాయతీ పదవులకు రాజీనామాలు సమర్పించారు. కాగా స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాలను ఆమోదించలేదు. అయినప్పటికీ తాము రేపటినుంచి శాసన సభకు హాజరు కాము అని వారు ప్రకటించారు. జే.సి వంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు తాము అధిష్టానానికి వ్యతిరేకం గ వెళ్లాలని అనుకోకున్నా ప్రజల మనోభీస్థలు తమకు ముఖ్యం కనుక వాటిని దెబ్బ తీయరాదనే తాము విధి లేని పరిస్థితుల్లోనే రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు.