మైక్రోసాఫ్ట్ ఏంటీ వైరస్ ను ఉచితం గా పొందండి
Oct 6th, 2009 | Category: టెక్నాలజీమైక్రోసాఫ్ట్ సంస్థ తన ఏంటీ వైరస్ సెక్యూరిటీ ఎస్సేన్షియల్స్ ను విపణి లోకి ప్రవేశ పెట్టింది. దీనిని వినియోగదారులకు ఉచితం గా అందిస్తున్నారు.

మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ ఎస్సేన్షియల్స్ మీ పర్సనల్ కంప్యూటర్ కు వైరసులు, స్పై వేర్ మరియు ఇతర ప్రమాదకరమైన సాఫ్ట్ వేర్ ల నుంచి రక్షణ కల్పిస్తుంది.
దీనికి అవసరమైనటువంటి సిస్టం కాన్ఫిగరేషన్:
- ఒరిజినల్ విండోస్ ఎక్స్.పి (సర్వీసు ప్యాక్ 2, సర్వీసు ప్యాక్ 3), విండోస్ విస్టా (గోల్డ్, సర్వీసు ప్యాక్ 1, సర్వీసు ప్యాక్ 2), విండోస్ 7
- విండోస్ ఎక్స్.పి కి 1 జీ.బీ రామ్, 500 మెగా హెర్ట్జ్ లేదా అంత కన్నా ఎక్కువ క్లాక్ స్పీడ్ కలిగిన సి.పి.యు కలిగి ఉండాలి
- విండోస్ విస్తా మరియు విండోస్ 7 కి 1 జీ.బీ రామ్, మరియు ఒక జిగా హెర్ట్జ్ లేదా అంత కన్నా ఎక్కువ క్లాక్ స్పీడ్ కలిగిన సి.పి.యు కలిగి ఉండాలి
- వి.జి.ఎ డిస్ ప్లే 800×600 లేక అంత కన్నా ఎక్కువ అయ్యి ఉండాలి
- 140 ఎం.బీ హార్డ్ డిస్క్ స్పేస్ కలిగి ఉండాలి.
- ఇన్స్టాలేషన్, డౌన్ లోడ్, అప్ డేట్ లకు ఇంటర్నెట్ సదుపాయం కలిగి ఉండాలి.
సాఫ్ట్ వేర్ ను ఇక్కడి నుంచి పొందండి