పెద్ద ఫైల్స్ ని పంపాలనుకుంటున్నారా: ఎలాగో చూడండి

Sep 20th, 2009 | Category: టెక్నాలజీ

ఎప్పుడైనా మీ మిత్రులతో సన్నిహితులతో మీవద్ద ఉన్న సమాచారాన్ని, లేదా వేరే ఎవన్నా ఫైల్స్ ని పంచుకోవాల్సిన అవసరం వస్తుంది. అటువంటి అప్పుడు పెద్ద పెద్ద ఫైల్స్ ని వారికి ఇంటర్నెట్ ద్వారా ఎలా పంపగలమో చూద్దాం.

ఈమెయిలు ని ఉపయోగించండి: గూగుల్, యాహూ వంటి ఈమెయిలు సర్వీసుల ద్వారా 25 ఎమ్ బి వరకు డేటా పంపవచ్చు. కాని 25 ఎమ్ బి ని మించి సమాచారాన్ని పంపటం వీటి ద్వారా సాధ్యం కాదు. అంతకన్నా ఎక్కువ దాతా ను పంపాలి అని అనుకుంటే లైకొస్ మెయిల్ (lycos mail ) ని ఉపయోగించవచ్చు. దీనికి అనుసంధానించే (attach ) చేసే సమాచారం పై కాని ఫైల్ సైజు పై కాని ఎటు వంటి నియంత్రణ లేదు. కాని ఆ సమాచారాన్ని పంపే వారు, అందుకునే వారు ఇరువురు లైకొస్ మెయిల్ ను మాత్రమే ఉపయోగించాలి.

విభజించి (split ) ఈమెయిలు చెయ్యండి: ఎహ్ జే స్ప్లిట్ (HJsplit ) వంటి సాఫ్ట్ వేర్ లని ఉపయోగించి మీ ఫైల్ ని చిన్న చిన భాగాలు గా విభజించి ఈమెయిలు చెయ్యవచ్చు. దానిని అందుకున్న వారు తిరిగి ఆ సమాచారాన్ని ఎహ్ జే స్ప్లిట్ (HJsplit ) తో జోడించి దాన్ని ఉపయోగించుకోవచ్చు.

బిట్ టోరెంట్ (bit torrent ) ని ఉపయోగించండి: మీరు పంపదలుచుకున్న సమాచారం ఎంత పెద్దది అయినా బిట్ టోరెంట్ ద్వారా మీరు దాన్ని పంపదలుచుకున్న వారికి పంపవచ్చు. ఇది పియర్ తో పియర్ నెట్ వర్క్ గా పని చేస్తుంది. మీ హార్డ్ డిస్క్ లో ఉన్న ఎటువంటి సమాచారాన్ని, ఫైల్ ని ఆయినా మీరు చేర్చదలుచుకున్న వారితో పంచుకోవచ్చు.

ఫైల్ షేరింగ్ సర్వీసెస్ (file sharing services ) ఉపయోగించండి: ఇంటర్నెట్ లో ఉచితం గా డబ్బులకు ఎన్నో ఫైల్ షేరింగ్ సర్వీసెస్ ఉన్నాయి. వాటి ద్వారా మీ డేటా ని మీరు పంచుకోవచు. మీరు అప్ లోడ్ చేసిన డేటా ను మీ స్నేహితులు ఆ లింక్ ను ఉపయోగించుకుని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీరు ఉపయోగించుకోగాలిగిన కొన్ని ఫైల్ షేరింగ్ సర్వీసెస్ ను కింద అందిస్తున్నాము. కాని వీటిని ఉపయోగించినా మీ డేటా పై మీకు ఎటువంటి నియంత్రణా ఉండదు. దానిని ఎవరైనా డౌన్ లోడ్ చేసుకోగలుగుతారు.

XDrive.com

yousendit.com

Box.net

dilbertfiles.com

Windows Live

Skydrive

Rapidshare

MegaUpload


Tags: , , , , ,

Leave Comment